Samantha Ruth Prabhu: ముంబాయికి వెళ్తున్న సమంత.. ఇక పర్మనెంట్‌గా అక్కడే..
Samantha Ruth Prabhu: సౌత్‌తో పాటు నార్త్‌లో కూడా బిజీ అయిన సమంత త్వరలోనే హాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వనుంది.;
Samantha Ruth Prabhu (tv5news.in)
Samantha Ruth Prabhu: సమంత రుత్ ప్రభు పేరు ప్రస్తుతం సౌత్‌లోనే కాదు.. నార్త్‌లో కూడా తెగ వినిపిస్తోంది. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌తో బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయిన సమంత.. పుష్పలోని ఐటెమ్ సాంగ్‌తో అందరినీ మరోసారి ఫిదా చేసింది. ఇక బాలీవుడ్‌లో తన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని సమంత ముంబాయి వెళ్లే ఆలోచనలో ఉందని టాక్. అక్కడ కోట్లు ఖర్చుపెట్టి ఓ ఇల్లు కూడా కొనుగోలు చేయనుందట సామ్.
ప్రస్తుతం సమంత ఇప్పటివరకు నటించిన సినిమాలన్ని ఒక ఎత్తు అయితే.. తాను చేసిన ఊ అంటావా ఊఊ అంటావా పాట మాత్రం మరో ఎత్తు అన్నట్టుగా మారిపోయింది తన క్రేజ్. అందుకే తనకు వరుసగా బాలీవుడ్ ఆఫర్లు వరిస్తు్న్నాయి. ఇప్పటికే యంగ్ హీరో వరుణ్ ధావన్‌తో ఓ వెబ్ సిరీస్ చేస్తున్న సమంత.. అక్షయ్ కుమార్‌తో కూడా ఓ సినిమా చేయనుందని సమాచారం.
ముంబాయిలో బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్‌కు హాజరుకావాల్సి ఉండడంతో సమంతకు ట్రావెలింగ్ ఇబ్బందిగా మారిందట. హైదరాబాద్ టు ముంబాయి ఊరికే చక్కర్లు కొట్టడంకంటే ముంబాయిలోనే ఓ ఇల్లు కొనుగోలు చేయాలని ఫిక్స్ అయిందట సమంత. అయితే దానికోసం రూ. 3 కోట్లు కూడా ఖర్చుపెట్టనున్నట్టు సమాచారం. సౌత్‌తో పాటు నార్త్‌లో కూడా బిజీ అయిన సమంత త్వరలోనే హాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వనుంది.