క్రేజీ హీరోయిన్ సమంతకు ఓటీటీలో ఉత్తమ నటి అవార్డు లభించింది. 'హనీ-బన్నీ' సిరీస్‌లో మంచి నటన కనబరిచినందుకు ఒక ప్రముఖ మీడియా సంస్థ ఆమెను ఈ పురస్కారంతో సత్కరించింది. ఈ అవార్డును అందుకోవడం పట్ల సమంత తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ప్రతికూల పరిస్థితుల నడుమ ‘హనీ-బన్నీ’ సిరీస్‌ను పూర్తి చేయడమే తనకు ఒక అవార్డు అని సమంత పేర్కొంది. తనను నమ్మిన వారందరికీ ఈ అవార్డును అంకితం చేస్తున్నట్లు ఆమె తెలిపింది. రాజ్ అండ్ డీకే, వరుణ్ ధావన్‌ల వల్లే తాను ‘సిటాడెల్ హనీ-బన్నీ’ని పూర్తి చేయగలిగానని సమంత చెప్పింది. సిరీస్‌ను పూర్తి చేయడానికి వారు ఎంతో ఓపికతో వ్యవహరించారని, తనను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారని ఆమె కృతజ్ఞతలు తెలిపింది. తెలుగులోనే కాదు, హిందీ, తమిళం వంటి ఇతర భాషల్లోనూ ట్యాలెంట్ ఉన్న నటిగా గుర్తింపు తెచ్చుకుంది సమంత. సినిమాలు లేకపోయినా వెబ్ సిరీస్ లతో ఆకట్టుకుంటోంది.