Sammelanam Web Series : నిజమైన స్నేహానికి నిర్వచనంలా నిలిచే ‘సమ్మేళనం’

Update: 2025-02-22 12:24 GMT

ఓటిటిల్లో వైవిధ్యమైన కథలు అనేకం వస్తున్నాయి. సరికొత్త ఆలోచనలతో వినూత్నమైన కథనాలతో మెప్పిస్తోన్న దర్శకులూ పెరుగుతున్నారు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని అద్బుతమైన కథలను చెబుతూ ఆకట్టుకుంటున్నారు. ‘సమ్మేళనం’ అనే వెబ్ సిరీస్ తో ఈ లిస్ట్ లోకి చేరాడు దర్శకుడు తరుణ్ మహాదేవ్. ఇది అతని ఫస్ట్ అటెంప్ట్. అయినా ఓ కొత్త కథతో మెప్పించాడు. ఈ నెల 20 నుంచి ఈటివి విన్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమ్ అవుతోంది. ఈ సిరీస్ లో ప్రియా వడ్లమాని, విగ్నయ్ అభిషేక్, ఆదిత్య గణ, జీవన ప్రియారెడ్డి, బిందు భార్గవి, శ్రీకాంత్ యాచమనేని, శ్రీకాంత్ గుర్రం తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

సమ్మేళనం కథ చూస్తే.. ‘స్నేహం అంటే ఏమిటి? నిజమైన స్నేహితుడు ఎలా ఉండాలి? ఒక స్నేహితుడి కోసం మరొకరు ఎంతవరకు వెళ్లగలరు? అలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పేదే ఈ సమ్మేళనం అనే వెబ్ సిరీస్. ఈ సిరీస్‌లో నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్ తమ జీవితాల్లోని తీయని జ్ఞాపకాలను, భావోద్వేగాలను పంచుకుంటారు. ఒకరి కోసం మరొకరు త్యాగాలు చేయడమే కాదు, అవసరమైన సమయంలో అండగా నిలుస్తారు. ఈ కథలోని స్నేహబంధం ప్రేక్షకుల హృదయాలను తాకుతుంది..’ అందుకే ఆడియన్స్ మనసులను కూడా విన్ అయిందీ సిరీస్ .

మొదటి రెండు ఎపిసోడ్స్ లో పాత్రలను పరిచయం చేయడానికి ఎక్కువ టైమ్ తీసుకున్నాడు దర్శకుడు. అయితే ఇది కాస్త ల్యాగ్ అయినట్టు అనిపించినా.. పాత్రధారుల నటనతో కొంత వరకూ ఓకే అనిపించేస్తుంది. ఇక థర్డ్ ఎపిసోడ్ నుంచి కథనం ఎమోషనల్ గా టర్న్ అవుతుంది. ఈ డ్రామాతో ప్రేక్షకులనూ ఆ ఎమోషన్ ఫీలయ్యేలా చేశాడు దర్శకుడు. మూడో ఎపిసోడ్ నుంచి కట్టిపడేసే కథనంతో పాటు ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే పాయింట్స్ తో అద్భుతంగా మలిచాడు. ఎక్కడా బోర్ అన్నదే లేకుండా ఆద్యంతం వినోదాత్మకంగానూ ఉండేలా చూసుకున్నాడు దర్శకుడు తరుణ్ మహాదేవ్.

టెక్నికల్ గా చూస్తే.. శ్రవణ్ కుమార్ సినిమాటోగ్రఫీతో పాటు ఎడిటింగ్ మెస్మరైజ్ చేస్తుంది. కెమెరామేనే ఎడిటర్ కూడా అయితే అవుట్ పుట్ పర్ఫెక్ట్ గా ఉంటుందని అందరికీ తెలుసు. వేస్ట్ షాట్స్ ఉండవు. తద్వారా ఎడిటింగ్ షార్ప్ గా ఉంటుంది. అలాగే కథను చెప్పడంలో బలమైన ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. అయితే పర్సనల్ గా చూస్తే శ్రవణ్ కుమార్ సినిమాటోగ్రఫీకి ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. ప్రతి ఫ్రేమ్ ను ఆర్టిస్టిక్ గా తీర్చి దిద్దాడు. విజువల్ గా చాలా గ్రాండ్ గా ఉండేలా తన పనితనం కనిపిస్తుంది. ఇక ఎడిటింగ్ పరంగానూ అంతే షార్ప్ గా కనిపించాడు శ్రవణ్.

శరవణ వాసుదేవ్ సంగీతం నెక్ట్స్ లెవల్ లో ఉంది. ఇలాంటి ఎంటర్టైనింగ్, ఎమోషనల్ సిరీస్ కు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే ఆడియన్స్ మనసులను నేరుగా తాకుతుందో అలాంటి బిజిఎమ్ అందించాడు. ఓ రకంగా తన మ్యూజిక్ తో ఈ సమ్మేళనం సిరీస్ కు బ్యాక్ బోన్ లా నిలిచాడు శరవణ వాసుదేవ్.

మొత్తంగా దర్శకుడు తరుణ్ మహాదేవ్ ఫస్ట్ అటెంప్ట్ లోనే ఓ అందమైన కథను చెప్పాడు. అదీ స్నేహం నేపథ్యంలో కావడంతో ఏజ్ తో పని లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల మనసులనూ తాకుతోందీ సిరీస్. చూసిన ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లోని స్నేహితులను, సంఘటనలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురవుతూనే ఆ జ్ఞాపకాలను మరోసారి తలచుకుంటున్నారు. అందుకే ఈ సమ్మేళనం సిరీస్ ను ప్రతి ఒక్కరూ చూడాల్సిందే అంటున్నారంతా.

Tags:    

Similar News