Radhe Shyam: 'సంచారి'గా ప్రభాస్.. రాధే శ్యామ్ నుండి డిఫరెంట్ సాంగ్..
Radhe Shyam: ప్రభాస్ అప్‌కమింగ్ ‘రాధే శ్యామ్’ నుండి పాటల సందడి మొదలయ్యింది.;
Sanchari Song (tv5news.in)
Radhe Shyam: ప్రభాస్ అప్‌కమింగ్ 'రాధే శ్యామ్' నుండి పాటల సందడి మొదలయ్యింది. విడుదలయిన ప్రతీ పాట మెలోడీ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా నుండి విడుదలయిన రెండు పాటలు మెలోడి సాంగ్సే. అయితే వాటికి భిన్నంగా ఓ ఫాస్ట్ బీట్ సాంగ్ ప్రోమోను విడుదల చేసింది రాధే శ్యామ్ టీమ్.
'సంచారి' పేరుతో విడుదలయిన ఈ పాట ప్రోమో ఇటీవల విడుదలయ్యింది. ఈ పాట చూస్తుంటే ఇది ప్రభాస్ ఇంట్రడక్షన్ సాంగ్‌లాగా అనిపిస్తోంది. అంతే కాకుండా రాధే శ్యామ్‌లో సంచారిగా, తరువాత నిమిషం ఏం జరుగుతుందో ఆలోచించకుండా ఫ్రీగా తిరిగే వ్యక్తిగా ప్రభాస్ కనిపించనున్నట్టు కూడా అనిపిస్తోంది.
సంచారి పూర్తి సాంగ్‌ను డిసెంబర్ 16న విడుదల చేయనున్నట్టు మూవీ టీమ్ ప్రకటించింది. ఇప్పటివరకు రాధే శ్యామ్ నుండి ప్రభాస్, పూజా హెగ్డే మధ్య డ్యూయెట్ పాటలను మాత్రమే చూసిన ప్రేక్షకులకు సంచారి ఒక డిఫరెంట్ ఫీల్ ఇచ్చే సాంగ్‌లాగా అనిపిస్తోంది. సంచారి లిరికల్ సాంగ్ తెలుగుతో పాటు మిగతా అన్ని భాషల్లో కూడా డిసెంబర్ 16నే విడుదల కానుంది.