Ram Charan : రామ్ చరణ్ తో సందీప్.. అంతా ఉత్తిదేనా..

Update: 2025-04-16 08:00 GMT

కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోన్న వార్తల్లో ఎక్కువమందిని అట్రాక్ట్ చేస్తోన్న న్యూస్.. సందీప్ రెడ్డి వంగా.. రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నాడు అని. మెగా ఫ్యాన్స్ అయితే ఈ వార్తను ఏకంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇంకొందరైతే.. సుకుమార్ సినిమాను కూడా పక్కన పెట్టి సందీప్ తో మూవీకి కమిట్ అయ్యాడు చరణ్ అంటున్నారు. చాలామంది ఇది నిజం అనుకుంటున్నారు కూడా. బట్ కాదు. భవిష్యత్ లో జరిగే అవకాశం ఉందేమో చెప్పలేం కానీ.. ఇప్పుడు బాగా వినిపిస్తోన్న ఈ న్యూస్ పూర్తిగా ఓ బేస్ లెస్ రూమర్. ఈ ఇద్దరూ కలిసి సినిమా గురించి ఎలాంటి డిస్కషన్స్ చేయలేదు.

ప్రస్తుతం సందీప్ ఫోకస్ అంతా ప్రభాస్ మూవీపైనే ఉంది. ప్రభాస్ ఒక్కసారి డేట్స్ ఇస్తే చాలా వేగంగా చిత్రీకరణ చేసి వచ్చే యేడాది వేసవిలో విడుదల చేయాలనే ప్లానింగ్ లో ఉన్నాడు. ఈ చిత్రంలో నటించే హీరోయిన్ తో పాటు ఇతర కాస్టింగ్ కు సంబంధించిన వర్క్స్ లో ఉన్నాడు సందీప్. ఈ టైమ్ లో అతను రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నాడు అనే వార్త రావడం అంటే అతని ఫోకస్ ను డైవర్ట్ చేయడమే అవుతుందనుకోవాలి. అఫ్ కోర్స్ ఇలాంటి గాసిప్స్ కు అతను రియాక్డ్ అవుతాడు అని కాదు. ఏదో సందర్భంలో అతని వరకూ వెళుతుంది కదా. అంతే కాదు.. అభిమానులు కూడా ఇది నిజం అనుకుని హ్యాపీగా ఉన్నారు. బట్ ఇది నిజం కాదు అనేది క్లియర్.

Tags:    

Similar News