Shanvi Meghna : శాన్వీ క్యూట్ నెస్.. స్టైలిష్ అండ్ ట్రెడిషనల్ లుక్

Update: 2025-03-31 06:30 GMT

బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వయ్యారి భామ శాన్వీ మేఘన. సైరా: నరసింహారె డ్డి', 'పిట్ట కథలు' సినిమాల్లోనూ మెరిసింది. దీని తర్వాత ఈ హైదరాబాదీ చిన్నది వరుసగా 'పుష్పక విమానం', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్', 'ప్రేమ విమానం' వంటి చిత్రాల్లో నటనతో ఆకట్టుకుంది. ఈభామ ఇటీవల కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటించిన తమిళ మూవీ కుడుంబస్థాన్ఓటీటీలో కుమ్మేస్తోంది. 200 మిలియన్లకు పైగా వ్యూస్ రికార్డు సృష్టించింది. మరోవైపు ఈనెల 21 రిలీజైన హారర్ కామెడీ 'టుక్క్' చిత్రంలో నూ మెరిసింది మన తెలుగమ్మాయి. ఇలా ఈ అమ్మడు వరుసగా మూవీలు చేస్తూ తనదైన రీతిలో ప్రభావాన్ని చూపిస్తూ ముందుకు సాగుతోంది. కొంతకాలంగా తనదైన చిత్రాలతో టాలీవుడ్లో కొంత మార్కును చూపిస్తోన్న శాన్వీ.. సినిమాల పరంగా అంతగా గుర్తింపును మాత్రం తెచ్చుకోలేదు. కానీ, సోషల్ మీడియా ద్వారా ఈ చిన్నది మాత్రం మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. నెట్టింటా ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే శాన్వి.. తాజాగా ఈ బ్యూటీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ తన ఫొటోలు ఇన్స్టాలో షేర్ చేసింది. లైట్ పింక్ శారీతో స్టైలిష్ అండ్ ట్రెడిషనల్ లుక్లో మెరిసిపోతుంది. ఈప్రస్తుతం ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి అదిరిపోయే స్పందన దక్కుతోంది. ' వావ్, బ్యూ టీఫుల్, క్యూట్ నెస్ఓవర్ లోడ్, బ్రైట్ నెసైస్మైల్, మెస్మరైజింగ్' అంటూ ఫ్యాన్స్ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Tags:    

Similar News