Sarkaru Vaari Paata : సర్కారు వారి పాట ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఫిక్స్..!

Sarkaru Vaari Paata : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన యాక్షన్, రొమాంటిక్ అండ్ కామెడీ మూవీ సర్కారు వారి పాట.

Update: 2022-05-03 09:45 GMT

Sarkaru Vaari Paata : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన యాక్షన్, రొమాంటిక్ అండ్ కామెడీ మూవీ సర్కారు వారి పాట... గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ మే 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. అందులో భాగంగా ఇప్పటికే రిలీజ్ చేసిన చిత్ర ట్రైలర్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. తాజా అప్‌డేట్ ప్రకారం సర్కారు వారి పాట ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈ నెల 7న హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరగనుందని తెలుస్తోంది.

దీనికి సంబంధించిన అధికార ప్రకటన త్వరలోనే రానుంది. అయితే ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ ఎవరన్నది తెలియాల్సి ఉంది. కాగా ఈ సినిమాని GMB ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మించాయి. సరిలేరు నీకెవ్వరు లాంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత సూపర్ స్టార్ నుంచి వస్తోన్న మూవీ కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Tags:    

Similar News