Lucifer Sequel Trailer : సైతాన్ సాయం.. ట్రైలర్ అదరహో..!

Update: 2025-03-20 11:45 GMT

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లూసీఫర్ సీక్వెల్ త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా ఎల్2 ఎంపారన్ పేరుతో హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో వస్తోంది. అయితే మలయాళం మినహా అన్ని భాషల్లో ట్రైలర్ వి డుదలైంది. మోహన్ లాల్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన సన్నివేశాలు యూనిక్ నెస్ తో రక్తి కట్టించాయి. ట్రైలర్ ఆద్యంతం "దైవ పుత్రుడే అన్యాయం చేస్తున్నప్పుడు సైతాన్ ని కాకుండా ఎవరిని సాయం అడగగలం!" అన్న డైలాగ్ సినిమా పట్ల ఆసక్తిని పెంచేస్తోంది. ఈ సినిమా కోసం దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ చాలా చెమటోడ్చారు. అతడు ఈ చిత్రంలో ఒక కీలక పాత్రను పోషించడమే కాకుండా చాలా హార్డ్ వర్క్ చేసారని తాజాగా రిలీజైన ట్రైలర్ చెబుతోంది. ట్రైలర్ నాలుగు నిమిషాల నిడివితో ఆద్యంతం రక్తి కట్టించింది. అధికారం, దురాశ, ద్రోహం, ప్రతీకారంతో ఆధిపత్యం చెలాయించే ఎంపురాస్ ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తుంది. మోహన్ లాల్ రక్షకుడైన స్టీఫెన్ నేడుంపల్లిగా ఎదిగే క్రమాన్ని ఈ ట్రైలర్ లో అద్భుతంగా ఆవిష్కరించారు. ఎంపురాన్ ట్రైలర్ పికె రాందాస్ వాయిస్ ఓవర్ తో ఇంట్రెస్టింగ్ నోట్ తో ప్రారంభమైంది.

Tags:    

Similar News