టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ వశిష్ట మల్లిడి కాంబోలో తెరకెక్కుతున్న తాజా మూవీ విశ్వంభర. చిరంజీవికి జంటగా కోలీవుడ్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా చేస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరిదశకు చేరుకుంది. షూటింగ్ ను త్వరగా పూర్తి చేసి సీజ్ వర్క్ ను కంప్లీట్ చేసే పనిలో పడ్డారు మేకర్స్. దాంతో పాటు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేశారట. అయితే ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేద్దామని అనుకున్నా.. మెగా హీరో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ వల్ల ఈ సినిమాను సమ్మర్ కు పోస్ట్ పోన్ చేశారు. దీంతో వచ్చే సమ్మర్ కి మరో మూవీ చేరింది. అయితే తాజా అప్డేట్స్ ప్రకారం 2025 మే 9న సినిమాను విడుదల చేసేందుకు టీమ్ రెడీ అవుతుందట. చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సాధించిన 'జగదేకవీరుడు అతిలోకసుందరి' మూవీ ఆరోజే రిలీజ్ అయింది. దీంతో అదే సెంటిమెంట్ తో విశ్వంభరను అరోజే రిలీజ్ చేయాలని చిరంజీవి భావిస్తు న్నారట.