టాలీవుడ్ బుల్లితెర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.హైదరాబాద్ నార్సింగ్‌లోని అల్కాపూరి కాలనీలోని తన నివాసంలో శుక్రవారం ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. 2015లో శిల్పను చందు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇటీవల రోడ్ యాక్సిడెంట్‌లో ‘త్రినయని’ సీరియల్ నటి పవిత్ర జయరాం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మరణ వార్త మరవకముందే అదే సీరియల్‌కు చెందిన మరో నటుడు చందు ఆత్మహత్య చేసుకోవడం తెలుగు బుల్లితెర ఇండస్ట్రీలో మరోసారి తీవ్ర విషాదాన్ని నింపింది. పవిత్ర జయరాంతో ఆరేళ్లుగా చందుకు వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె మరణానంతరం ఆయన పూర్తిగా డిప్రెషన్‌కి వెళ్లిపోవడమే ఆత్మహత్యకు కారణం అనేలా వార్తలు వినబడుతున్నాయి. చందు ఆత్మహత్యకు సంబంధించిన కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు