Shaakuntalam Movie : శాకుంతలం మోషన్ పోస్టర్.. సమంత లుక్ సూపర్..
Shaakuntalam Movie : దర్శకుడు గుణశేఖర్ కలల ప్రాజెక్ట్ శాకుంతలం. మహాభారతంలోని ఆదిపర్వం స్ఫూర్తితో కాళిదాసు రచించిన 'అభిజ్ఞాన శాకుంతలం' ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు గుణశేఖర్.;
Shaakuntalam Movie : దర్శకుడు గుణశేఖర్ కలల ప్రాజెక్ట్ శాకుంతలం. మహాభారతంలోని ఆదిపర్వం స్ఫూర్తితో కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం' ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు గుణశేఖర్. ఈ చిత్రంలో సమంత శకుంతలగా అద్భుత నటన ప్రదర్శిస్తోంది. ఆమెకు జోడీ దుష్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్ కనిపించనున్నారు.
ఈ అద్భూత పౌరాణిక చిత్రంలో అల్లు అర్జున్ కూతురు అర్హ చిట్టి భరతుడి పాత్రలో కనిపించనుంది. భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ చిత్రాన్ని నవంబర్ 4న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు.
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి సన్నహాలు చేస్తోంది చిత్ర యూనిట్. సమంత.. శాకుంతలం ప్రారంభానికి కొన్ని నెలల ముందు నుంచే "బాడీ లాంగ్వేజ్ శిక్షణ" తీసుకున్నట్లు సమాచారం.
పౌరాణిక నాటకంలో శకుంతల పాత్ర యొక్క 'క్లాసికల్' మోడ్‌కి సరిపోయేలా ఆమె మూడు నెలల పాటు శిక్షణ తీసుకుంది. సాధారణ భంగిమలు, మనోహరమైన నడక ఇవన్నీ శిక్షణలో భాగమని ఆమె ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.