Sharwa 38 Title : శర్వా-38 టైటిల్ ఫిక్స్

Update: 2025-05-01 07:30 GMT

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్, దర్శకుడు సంపత్ నంది కాంబోలో ఓ సినిమా ((శర్వా 38) రాబోతున్న విషయం తెలిసిందే. 1960ల చివర్లో ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో జరిగిన కథ ఆధారంగా ఈ చి త్రాన్ని రూపుదిద్దుతున్నారు. మరపురాని అనుభూతిని కలిగించే పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ రా బోతుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే తాజాగా ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ ను అనౌన్స్ చేసింది చిత్రబృందం. ఈచిత్రానికి 'భోగి' అనే టైటిల్ ను ఫిక్స్ చేసింది. ఈ సందర్భంగా ఫస్ట్ స్పార్క్ అంటూ ఓ వీడియోను పంచుకుంది. దీన్ని' షేర్ చేసిన సంపత్ నంది 'ప్రతి రక్తపు చుక్కకు ఒక కారణం ఉంటుంది. ప్రతి పండగకు ఓ ప్రయోజనం ఉంటుంది' అని పే ర్కొన్నారు. ఈ చిత్రంలో శర్వానంద్ సరసన అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి నటించనున్నారు. దీని షూటింగ్ కూడా ప్రారంభమైందని మూవీ టీమ్ వెల్లడించింది. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ నిర్మాణం వహిస్తున్న ఈమూవీకి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నాడు.

Tags:    

Similar News