ఇంతకాలం క్లాస్ చిత్రాలతో అలరించిన హీరో శర్వానంద్ మొదటిసారి పక్కా మాస్ సినిమా చేసేందుకు సిద్దమవుతున్నాడు. అందుకోసం దర్శకుడు సంపత్ నందితో జతకట్టాడు. ఈ ప్రాజెక్టుకు సంబందించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు నిర్మాత కెకె రాధామోహన్. 1960 చివరి కాలంలో ఉత్తర తెలంగాణ, తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా తెరకెక్కనుందట. యాక్షన్ మరియు ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాకు సౌందర్ రాజన్ కెమెరామెన్ గా చేస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంచిన రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.