Actress Vara Laxmi : వాట్.. వరలక్ష్మికి కాబోయే భర్తకు15 ఏళ్ల కూతురు ఉందట!
లేడీ విలన్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్ ( Varalaxmi Sarath Kumar ). మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మాస్ లుక్ లో జయమ్మ అనే పాత్రలో అద్భుతంగా నటించింది. ఇటీవలే హనుమాన్ సినిమాతో భారీ హిట్ అందుకుంది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే త్వరలోనే వరలక్ష్మి పెళ్లి పీటలెక్కనుంది. ఇటీవలే గ్రాండ్గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది.
నికోలాయ్ సచ్ దేవిని ఆమె వివాహాం చేసుకోనుంది. ఈ ఇద్దరి పెళ్లి థాయిలాండ్లో జరగనుండగా ఇప్పటికే శుభలేఖలు పంచే పనిలో బిజీగా ఉంది వరలక్ష్మి. ఇప్పుడు వరలక్ష్మికి కాబోయే భర్త గురించిన ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ఆయనకు పదిహేనేళ్ల కూతురు ఉందట.. ఇప్పుడు వరలక్ష్మిని ఆయన రెండో పెళ్లి చేసుకోబోతున్నారట.
వరలక్ష్మికి 14 ఏళ్లుగా నికోలాయ్ బాగా తెలుసట. నికోలాయ్ మొదటి భార్య పేరు కవిత. ఆమె 2010లో మిసెస్ గ్లాడ్రాగ్స్ టైటిల్ను గెలుచుకుంది. ఈ ఇద్దరికీ ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కాగా తాజాగా వరలక్ష్మి నికోలాయ్ కూతురితో కలిసి ఫోటోలు దిగింది. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వరలక్ష్మికి కాబోయే భర్తకు ఇంత పెద్ద కూతురు ఉందా? అని అంతా షాక్ అవుతున్నారు. నికోలాయ్ కూతురు వెయిట్ లిఫ్టింగ్లో అథ్లెట్ ఛాంపియన్ కూడానని తెలుస్తోంది.