ఏ సినిమా షూటింగ్ లో అయినా స్టార్ హీరోలు ఉంటే ఆ సందడి వేరుగా ఉంటుంది. ప్రస్తుతం రెండు టాప్ మూవీస్ షూటింగ్ జరుగుతోంది. కానీ హీరోలు అటెండ్ కావడం లేదు. అలాగని ఆ హీరోలు షూటింగ్స్ ఎగ్గొట్టడం లేదు. కేవలం గ్యాప్ ఇచ్చారంతే. మరి ఈ గ్యాప్ లో ఏం చేస్తున్నారు. ఇంతకీ ఆ సినిమాలేంటీ.. హీరోలెవరూ అంటే.. ఒకటి ప్రభాస్ రాజాసాబ్. రెండోది పవన్ కళ్యాణ్ ఓ.జి. యస్ ప్రస్తుతం ఈ రెండు సినిమాల చిత్రీకరణ జరుగుతోంది. రాజా సాబ్ షూటింగ్ లో హీరో లేని సన్నివేశాలు చిత్రీకిరస్తున్నాడు దర్శకుడు మారుతి. అలాగని ప్రభాస్ ఏం ఖాళీగా లేడు. ఈ టైమ్ లో హను రాఘవపూడి డైరెక్షన్ లో రూపొందుతోన్న ఫౌజీ( వర్కింగ్ టైటిల్) షూటింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. అంటే ఒకేసారి రెండు సినిమాలు రెడీ అవుతున్నాయి అనుకోవచ్చు. రాజా సాబ్ ను 2025 వేసవి బరిలో ఏప్రిల్ 10న విడుదల చేయబోతున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తోన్న 'ఓ.జి' షూటింగ్ కూడా జరుగుతోంది. ఈ షూటింగ్ లో పవన్ కళ్యాణ్ ఇంకా జాయిన్ కాలేదు. ఆయన లేని సీన్స్ ను షూట్ చేస్తున్నారు. త్వరలోనే డిప్యూటీ సిఎమ్ సెట్స్ లో అడుగుపెడతాడు అంటున్నారు. మొత్తంగా హీరోలు లేకపోయినా ఈ రెండు సినిమాల చిత్రీకరణ కొనసాగుతూనే ఉంది. కాకపోతే ఓ.జి ఎప్పుడు పూర్తవుతుంది.. ఎప్పుడు విడుదలవుతుంది అనే క్లారిటీ రావాల్సి ఉంది.