Director Maruti : మారుతి మళ్లీ మొదలుపెట్టాలా..?

Update: 2026-01-22 11:29 GMT

దర్శకుడు మారుతికి వచ్చిన బిగ్గెస్ట్ ఛాన్స్ రాజా సాబ్. ఈ మూవీ రిజల్ట్ మాత్రం దారుణంగా దెబ్బైపోయింది. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం మారుతిపై ఘోరంగా ఫైర్ అవుతున్నారు. అతన్ని దారుణంగా విమర్శలు చేస్తున్నారు. బట్ సినిమాల ఆటలో హిట్టూ, ఫ్లాపులు మాత్రం చాలా కామన్ కదా. ఆ విషయంలో మారుతిపై ఫైర్ అవడం మాత్రం తప్పు కదా అని మరికొంతమంది కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా చెబితే ఈ ఫ్లాప్ లో ప్రభాస్ హ్యాండ్ కూడా ఉంది కదా అతనిపై కూడా మాట్లాడాలి కదా అంటున్నారు. సరే ఇవన్నీ ఎలా ఉన్నా.. ఇప్పుడు మారుతి ముందున్న విషయం ఏంటీ అనేది పెద్ద ప్రశ్న.

నిజానికి మారుతి చేసిన పెద్ద తప్పు. ఆ తప్పును దాటుకుని మళ్లీ ఓ కొత్త విజయాన్ని అందుకోవాలి. ఆ బాధ్యత అతనిపై స్పష్టంగా ఉంది. ప్రభాస్ లాంటి ప్యాన్ ఇండియా స్టార్ తో చేసిన మూవీ డిజాస్టర్ అయింది. అయినా ఆ విషయాన్ని మైండ్ లో పెట్టుకోవడం చేయకూడదు. అతని రేంజ్ ఏంటీ అనేది క్లియర్ గా తెలుసుకోవాలి. ఆ రేంజ్ కు తగ్గట్టుగా మరో హీరోతో సినిమా చేయాలి. ఆ విషయంలో ఈ సారి అతను ఎంచుకునే కథల పట్ల క్లారిటీతో ఉండాలి. కథనంపై పట్టు ఉండాలి. అప్పుడే మరో నిర్మాత అతనికి అవకాశం ఇస్తాడు. అయితే ఈ విషయంలో ముందు అతనికి ఏ నిర్మాత ముందుకు వస్తాడు అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే అతని గత మూవీస్ కూడా దారుణంగా పోయాయి. ఆ మూవీస్ పరాజయం మర్చిపోయేలా రాజా సాబ్ అవుట్ పుట్ ఇస్తాడు అనుకుంటే అదీ పోయింది.

సో.. కొంత టైమ్ తీసుకుని క్లియర్ గా స్టోరీ, స్క్రీన్ ప్లే రాసుకుని దానికంటే ముందు రాజా సాబ్ డిజాస్టర్ మర్చిపోయి.. నిర్మాతను అప్రోచ్ అవడం ఇంపార్టెంట్. అప్పుడు అతనికి కొత్త విజయం ఖాయం అవుతుంది. బలమైన కంటెంట్ తో ఉండే ఏ దర్శకుడైనా బలంగా ఉంటాడు. ఈ విషయంలో మారుతి మరోసారి ఆలోచించుకుని పాత ఫ్లాప్స్ ను మర్చిపోయేలా కొత్త విజయాన్ని అందుకోవాలి. 

Tags:    

Similar News