Bollywood : నానితో శ్రద్దా కపూర్

Update: 2024-10-23 07:00 GMT

బాలీవుడ్‌ అగ్ర కథానాయిక శ్రద్ధాకపూర్‌ తెలుగు చిత్రసీమలో అరంగేట్రానికి రంగం సిద్ధమైందని సమాచారం. వివరాల్లోకి వెళితే.. నానితో ‘దసరా’వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాన్ని అందించాడు యువ దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల. వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో శ్రద్ధాకపూర్‌ను కథానాయికగా ఖరారు చేయబోతున్నారని తెలిసింది. ఇప్పటికే ఆమెతో చిత్ర బృందం సంప్రదింపులు జరిపిందని, కథలోని కొత్తదనం నచ్చడంతో శ్రద్ధాకపూర్‌ ఈ సినిమాకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిందని అంటున్నారు. ఎప్పటి నుంచో దక్షిణాది అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నది శ్రద్ధాకపూర్‌. ఈ నేపథ్యంలో నాని చిత్రం ద్వారా ఆమె టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతుండటం విశేషం. ఈ విషయంలో చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Tags:    

Similar News