Shruti Haasan : దారి తప్పి 30 మైళ్లు నడిచిన శ్రుతి హాసన్

Update: 2025-05-16 11:00 GMT

విశ్వనటుడు కమల్ హసన్, ఆయన కూతురు ప్రముఖ నటి శ్రుతి హాసన్ దారి తప్పారు.. దట్టమైన అడవిలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ముప్పై మైళ్లు నడిచారు. ఆ తర్వాత దేవుడిలా ఓ గొర్రెల కాపరి కనిపించడంతో ఇంటికి చేరుకున్నారు. ఇది సినిమా కథ కాదు.. నిజం..! థగ్ లైఫ్ సినిమా చిత్రీకరణ సందర్భంగా జరిగిందని కమల్ హాసన్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. కమల్ హాసన్, శింబు, త్రిష ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమ థగ్ లైఫ్. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కొన్ని దశాబ్దాల తర్వాత కమల్ మణిరత్నం కాంబినేషన్ లో రిలీజ్ అవుతున్న చిత్రం కావడంతో థగ్ లైఫ్ పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా అటవీ ప్రాంతం లోనూ చాలా సన్నివేశాలు చిత్రీకరించారు. చీమలు దూరని చిట్టడివి, కాకులు దూరని కారడివిలో కొన్ని కీలకమైన ఎపిసోడ్స్ షూట్ చేసారు. అయితే ఈ సమయంలో కమల్ హాసన్, శ్రుతి హాసన్ అడవిలో దారి తప్పినట్లు తాజాగా వెల్లడించారు. ఈ విషయాన్ని కమల్ ఎక్కడా రివీల్ చేయలేదు. సాధారణంగా ఇలాంటి విషయాలు సోషల్ మీడియాలో తిరిగి ఇంటికొచ్చాక షేర్ చేసుకుంటారు. కానీ కమల్ మాత్రం గోప్యంగా ఉంచారు. రిలీజ్ సమయం దగ్గర పడటం తో రివీల్ చేశారు. ఇప్పుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Tags:    

Similar News