Rashmika Mandanna : రష్మిక జైత్రయాత్రకు అడ్డుకట్ట పడిందా

Update: 2025-03-31 08:00 GMT

ప్యాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ల మీద బ్లాక్ బస్టర్లు కొడుతూ మోస్ట్ లక్కీయొస్ట్ హీరోయిన్ అనిపించుకున్న బ్యూటీ రష్మిక మందన్నా. ఈ బెంగళూరు బ్యూటీకి తెలుగు వాళ్లు హిట్లు ఇస్తే వాటి మీదుగా బాలీవుడ్ కు వెళ్లింది. మొదట్లో తడబడ్డా యానిమల్, పుష్ప 2, ఛావా వంటి మూవీస్ తో ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయింది. ఈ మూడు సినిమాల కలెక్షన్స్ చూస్తే 3 వేలకు పై మాటే. దీంతో మూడు వేల కోట్ల హీరోయిన్ అనేశారు జనం. ఇక తన దూకుడు చూసి సల్మాన్ ఖాన్ సరసన నటించిన సికందర్ కూడా మరో బ్లాక్ బస్టర్ అవుతుందనుకున్నారు. బట్ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి మినిమం బజ్ కూడా రాలేదు. ఆఖరికి థియేటర్స్ లో టికెట్స్ కోసం ఆఫర్స్ పెట్టారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. పైగా కాజల్ అగర్వాల్ మరో హీరోయిన్ గా నటించింది. సల్మాన్ వైఫ్ గా రష్మిక మందన్నా నటించింది. అయితే తను చనిపోతుంది. ఆమె అవయవాలు దానం చేస్తాడు సల్మాన్. అవి ఎవరికైతే అమర్చారో వారిని చంపాలని చూస్తుంటాడు విలన్ సత్యరాజ్. దీంతో తన భార్య అవయవాలు ఉన్న మనుషులను కాపాడేందుకు ముంబైకి వస్తాడు సల్మాన్. ఇలా ఏ మాత్రం ఆకట్టుకోని ప్లాట్ తో అస్సలే మాత్రం ఆకట్టుకోని కథనంతో చూసిన వాళ్లంతా థియేటర్స్ నుంచి పరుగులు పెట్టేలా రూపొందించాడు దర్శకుడు మురుగదాస్. అసలు ఈ మూవీ తీసింది అతనేనా అని ఆశ్చర్యపోతున్నారు చాలామంది. ఏదేమైనా సికందర్ డిజాస్టర్స్ కా బాప్ అనేలా మారింది. దీంతో రష్మిక మందన్నా జైత్రయాత్రకూ అడ్డుకట్ట వేసింది.

Tags:    

Similar News