తీవ్ర విషాదం : ఎస్పీ బాలసుబ్రమణ్యం కన్నుమూత

ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కన్నుమూశారు. గత 40 రోజులుగా చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ..

Update: 2020-09-25 08:06 GMT

ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కన్నుమూశారు. గత 40 రోజులుగా చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం ఎజిఎం ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన అభిమానులు, సంగీత ప్రేమికులు తీవ్ర దిగ్బ్రాంతిలో మునిగిపోయారు. కాగా ఎస్పీ బాలసుబ్రమణ్యం నెల్లూరు జిల్లా లోని కోనేటమ్మపేట గ్రామంలో ఒక సాంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబములో జన్మించారు. తండ్రి హరికథా కళాకారుడు కావడంతో బాలుకు చిన్నప్పటి నుంచే సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది. తండ్రి కోరిక మేరకు చదువుకుంటూనే పాడటం నేర్చుకున్నారు. 1966 లో పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకుడిగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40 వేలకుపైగా పాటలు పాడారు. అభిమానులు ఆయనను ముద్దుగా బాలు అని పిలుస్తారు. 

Tags:    

Similar News