శ్రీవిష్ణు, కేతికా శర్మ, ఇవానా, వెన్నెల కిషోర్ నటీనటులుగా తెరకెక్కిన సినిమా సింగిల్. ఈ కామెడీ, లవ్ ఎంటర్టైనర్ సింగిల్ మూవీ బాక్సఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ టార్గెట్ కొ ట్టేసిన ఈ సినిమా లాభాలను అందిస్తోంది. ఈ ఈ మూవీకి కార్తీక్ రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈసినిమా 10రోజుల్లో ఎన్నికోట్లు వసూలు చేసింది? ఎన్ని కోట్ల లాభాలను అందిం చిందనేది హాట్ టాపిక్స గా మారింది. సింగిల్ చిత్రాన్ని సుమారుగా 15 కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందించారు. ఈ మూవీ లాభా తో ల్లోకి రావాలంటే రూ.8 కోట్ల షేర్.. రూ.16 కోట్ల గ్రాస్ వసూలు చేయాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. ఈ నెల 9న సుమారుగా తెలుగు రాష్ట్రాల్లో 400 స్క్రీన్లలో, ప్రపంచవ్యాప్తంగా 700 స్క్రీన్లలో సింగిల్ సినిమాను రిలీజ్ చేశారు. సింగిల్ 9 రోజుల వసూళ్లు సింగిల్ మూవీకి తొలి రోజు ఇండియాలో రూ.2.5 కోట్లు, రెండో రోజు రూ.3.5 కోట్ల నెట్, మూడో రోజు రూ.3.55 కోట్ల నెట్, నాలుగో రోజు రూ.1.7 కోట్లు, ఐదో రోజు రూ.1.58 కోట్లు, ఆరో రోజు రూ.1.17 కోట్లు, ఏడో రోజు రూ.1.1 కోట్లు, ఎనిమిదో రోజు రూ.1.32 కోట్లు, తొమ్మిదో రోజు రూ.1.83 కోట్లు చొప్పున 9 రోజుల్లో సింగిల్ మూవీ నికరంగా రూ.19 కోట్లు సాధిం చినట్లు సాకి నిల్క్ తెలిపింది. అలాగే ఓవర్సీస్లో రూ.3.25 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ పండితులు చెప్పారు. రూ.40 కోట్ల కలెక్షన్ దిశగా పరుగులు పెడుతోందీ మూవీ.