ప్రభాస్ దూకుడుకు ప్యాన్ ఇండియా హీరోలు కూడా ఆశ్చర్యపోతున్నారు. నిజానికి ఒకప్పుడు ఇంత స్పీడ్ గా లేడు ప్రభాస్. బాహుబలి తర్వాత సాహో వెంటనే వచ్చినా రాధేశ్యామ్ కాస్త ఇబ్బంది పెట్టింది. బట్ సలార్ తో పాటు కల్కి వెంట వెంటనే వచ్చాయి. నెక్ట్స్ సమ్మర్ ఏప్రిల్ 10న రాజా సాబ్ విడుదల కాబోతోంది. ఈలోగా మరో ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ కాబోతోంది. ముందుగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్ అనే మూవీ స్టార్ట్ అవుతుందనుకున్నారు. బట్ దానికంటే ముందు హను రాఘవపూడి బౌండ్ స్క్రిప్ట్ తో వచ్చాడు. అందుకే హను రాఘవపూడి ప్రాజెక్ట్ సందీప్ కంటే ముందు పట్టాలెక్కబోతోంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన కీలకమైన అప్డేట్ వచ్చింది.
ప్రస్తుతం ‘ఫౌజీ’ అనే వర్కింగ్ టైటిల్ తో స్టార్ట్ కాబోతోంది హను రాఘవపూడి సినిమా. ఇది ఇండో పాక్ యుద్ధ నేపథ్యంలో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథ అంటున్నారు. ఇందులో స్వాతంత్ర్య పోరాట యోధుడు ఆజాద్ హింద్ ఫౌజ్ ఫౌండర్ సుభాష్ చంద్రబోస్ ప్రస్థావన కూడా ఉంటుందనే టాక్ బలంగా వినిపస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కూడా అయిపోయిందట. అందుకే వెంటనే పట్టాలెక్కిస్తున్నారు. ఆగస్ట్ 17న పూజా కార్యక్రమాలతో ఈ మూవీ లాంఛనంగా ప్రారంభం అవుతుంది. ఆగస్ట్ 24 నుంచి రెగ్యులర్ షూట్ కు వెళతారట. అంటే అటు రాజాసాబ్ తో పాటు సైమల్టేనియస్ గా ఫౌజీ షూటింగ్ లోనూ పాల్గొంటాడు ప్రభాస్. అందుకే రాజా సాబ్ నెక్ట్స్ ఇయర్ వరకూ వెళ్లిందనే కమెంట్స్ కూడా ఉన్నాయి.
మరో విశేషం ఏంటంటే.. సందీప్ రెడ్డి మూవీ కూడా ఈ యేడాదే ప్రారంభం అవుతుంది. కాకపోతే రెగ్యులర్ షూటింగ్ మాత్రం 2025 ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుందట. ఈ స్పిరిట్ మేటర్ ఎలా ఉన్నా.. ప్రభాస్ నుంచి 2025లో రెండు సినిమాలు రావడం మాత్రం పక్కా. మరి ఓ ప్యాన్ ఇండియా స్టార్ ఒకే యేడాది రెండు సినిమాలు చేశాడంటే బాక్సాఫీస్ తో పాటు ఇండస్ట్రీకీ అంతకు మించిన బూస్టప్ ఏముంటుంది..?