Sonam Kapoor : బాలీవుడ్ బ్యూటీ.. బేబీ బంప్ తో ఫోటో షూట్..
Sonam Kapoor : తాజాగా సోనమ్ తన బేబీ బంప్ తో ఫోటోషూట్ చేసిన చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.;
Sonam Kapoor: బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ భర్త ఆనంద్ అహూజాలు తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారు. నటి గత నెలలో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా గర్భం దాల్చిన విషయాన్ని ప్రకటించింది.
తాజాగా సోనమ్ తన బేబీ బంప్ తో ఫోటోషూట్ చేసిన చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. సోనమ్ కపూర్ నాలుగు నెలల గర్భవతి అని తెలియడంతో 2022 ఆగస్టు 3వ వారంలో ఆమె తన బిడ్డకు జన్మనిచ్చే అవకాశాలు ఉన్నాయి.
సోనమ్ కపూర్ లేటెస్ట్ ఫోటోలలో ప్రెగ్నెన్సీ గ్లో కొట్టొచ్చినట్లు ఆమె మొఖంలో కనబడుతోంది. గత రాత్రి, ఆమె డిజైనర్ అబు జానీ పుట్టినరోజు వేడుకకు హాజరయ్యారు. సోనమ్ ధరించిన దుస్తులను డిజైనర్లు అబు జానీ, సందీప్ ఖోస్లా లు డిజైన్ చేశారు.
సోనమ్ కపూర్ వ్యాపారవేత్త ఆనంద్ అహూజాను వివాహం చేసుకుంది. మే 2018లో వివాహం చేసుకోవడానికి ముందు ఇద్దరూ దాదాపు నాలుగు సంవత్సరాల పాటు డేటింగ్ చేశారు.