Sonu Sood : సోనూ సూద్ గొప్ప మనసు...వృద్ధాశ్రమం ఏర్పాటు చేయనున్న రియల్ హీరో.

Update: 2025-08-01 12:15 GMT

.

సేవా కార్యక్రమాలతో అందరికి ఆదర్శంగా నిలుస్తున్న ప్రముఖ నటుడు సోనూసూద్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. జూలై 30 న జరిగిన తన పుట్టినరోజు సందర్భంగా వృద్ధుల కోసం ఆశ్రమం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దాదాపు 500 మంది వృద్ధులకు ఆశ్రయం కల్పించేలా ఈ ఆశ్రమం ఉంటుందని ఆయన తెలిపారు. భోజనం ,వసతితో పాటు వృద్ధుల కోసం వైద్య సదుపాయం కూడా కల్పించేలా ఈ ఆశ్రమం లో ఏర్పాట్లు చేస్తున్నారు.

తన సొంత ట్రస్టు ద్వారా ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపుతున్నారు సోనూ సూద్. విద్య, వైద్యం, ఆరోగ్యం ఇలా సమస్య ఏదైనా సరే..తన దృష్టికి వెళ్తే వారిని ఆదుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. సామాజిక సేవలో అందరికీ స్పూర్తిగా నిలిచే సోనూసూద్ ...ఇటీవలే హైదరాబాద్ లో జరిగిన మిస్ వరల్డ్ ఫైనల్స్ వేడుకల్లో ప్రతిష్టాత్మక మానవత వాది అవార్డు కూడా తీసుకున్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో ఎంతో మందికి సాయపడి రియల్ హీరో అనిపించుకున్నారు. అప్పటి నుండి దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రశంసలు అందుకున్నారు. కాగా ఇటీవలే 52 వ వసంతంలోకి అడుగు పెట్టిన సోనూ సూద్ వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి సేవ చేయాలని నిర్ణయించుకున్నారు.

Tags:    

Similar News