Soundarya Rajinikanth : అక్క ఐశ్వర్యకు సపోర్ట్‌గా సౌందర్య.. వైరల్‌గా మారిన పిక్..!
Soundarya Rajinikanth : కోలీవుడ్‌లో స్టార్ కపుల్స్‌గా ఓ వెలుగు వెలిగిన తమిళ హీరో ధనుష్, సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్యల డైవర్స్ మ్యాటర్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.;
Soundarya Rajinikanth : కోలీవుడ్‌లో స్టార్ కపుల్స్‌గా ఓ వెలుగు వెలిగిన తమిళ హీరో ధనుష్, సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్యల డైవర్స్ మ్యాటర్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరూ విడాకులు తీసుకోవడం అభిమానులు ఎవ్వరూ కూడా జీర్ణించుకోలేకపొతున్నారు. 2004లో ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరికీ ఇద్దరు కుమారులున్నారు.
అయితే ధనుష్-ఐశ్వర్య విడిపోవడం పట్ల హీరో రజినీకాంత్ ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం. విడాకుల ప్రకటనకు ముందే రజనీకాంత్‌కు ధనుష్, ఐశ్వర్యలు ఫోన్ చేశారని, వారి నిర్ణయానికి రజినీకాంత్ అడ్డు చెప్పలేదని తెలుస్తోంది.
ఇదిలావుండగా తన అక్క ఐశ్వర్య తీసుకున్న నిర్ణయానికి చెల్లెలు సౌందర్య మద్దతు తెలిపారు. ట్విటర్ ఖాతాలోని ప్రొఫైల్ పిక్‌ని మార్చింది సౌందర్య.. చిన్నప్పుడు తన తండ్రి రజినీకాంత్ తో దిగిన ఫోటోను ప్రొఫైల్ పిక్ గా మార్చింది. ఈ ఫోటోలో రజినీకాంత్ తన ఇద్దరు కూతుళ్ళను ఎత్తుకొని ఉన్నారు.
ఇక సౌందర్య రజనీకాంత్ ఫిబ్రవరి, 2019లో విషగన్ వనంగముడిని రెండో వివాహం చేసుకున్నారు. 1999 నుండి ఆమె సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేశారు, కొచ్చాడైయాన్ మొదలగు చిత్రాలకు ఆమె దర్శకత్వం కూడా వహించారు . ఆమె గతంలో ఆర్ అశ్విన్‌తో ఆమె మొదటి వివాహం జరిగింది. వీరిద్దరికీ వేద్ అనే 6 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు.
#NewProfilePic pic.twitter.com/0SnIQYvkkg
— soundarya rajnikanth (@soundaryaarajni) January 17, 2022