Actress Jacqueline Fernandez : ఆరోగ్యం కోసం ఆధ్యాత్మిక ప్రయాణం

Update: 2025-08-04 08:30 GMT

డార్లింగ్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ 'సాహో'లో బ్యాడ్ బోయ్ సాంగ్ అభిమానుల ఫేవరేట్ పాటలలో ఒకటిగా ఉన్న విషయం తెలిసిందే. దానికి కారణం ఆ స్పెషల్ సాంగ్లో గ్లామరస్ క్వీన్ జాక్విలిన్ ఫెర్నాండెజ్ అందాల ఆరబోత, టీజింగ్ ఎక్స్ప్రెషన్స్, కవ్వించే యాటి ట్యూడ్. ఆ తర్వాత ఈ భామ కేవలం బాలీవుడ్ కే పరిమితం అయింది. ఇటీవల రిలీజైన హౌజ్ఫుల్ 5లో కనిపించింది. తర్వాత మరో భారీ ఫ్రాంచైజీ చిత్రం వెల్ కం టు ది జంగిల్లోనూ కనిపించనుంది. తెలుగు, తమిళంలో అవకాశాలు మాత్రం లేవు. అయినా సరే సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి అంతకంతకు ఫాలోయింగ్ పెరుగు తోంది. తాజాగా అ అమ్మడు తన్ టోన్డ్ ఫిజిక్ ని ఎలివేట్ చేస్తూ పోల్ డ్యాన్స్ చేసిన వీడియోను షేర్ చేయగా.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వైట్ క్రాఫ్ట్ టాప్ బ్లాక్ స్కర్ట్ ధరించి అద్భుతంగా కనిపిం చింది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్వతహాగా ఫిట్నెస్ ఫ్రీక్. పోల్ డ్యాన్స్ తో ఫిట్గా ఉండేందుకు చాలా ప్రాక్టీస్ చేస్తోంది. ఫిట్నెస్తోనే మానసిక ప్రశాంతత సాధ్యమని నమ్మే ఈ భామ.. ఆరోగ్యం కోసం ఆధ్యాత్మిక ప్రయాణం అని వెల్లడించింది.

Tags:    

Similar News