sreeja konidela : పొడుగ్గా ఉన్నంత మాత్రాన తెలివైన వాళ్లమని అనిపించుకోలేరు : శ్రీజ ఎమోషనల్ పోస్ట్..!
sreeja konidela : మెగా వారసుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నేడు(జనవరి 19) పుట్టినరోజు జరుపుకుంటున్నాడు..;
sreeja konidela : మెగా వారసుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నేడు(జనవరి 19) పుట్టినరోజు జరుపుకుంటున్నాడు.. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక మెగాఫ్యామిలీ నుంచి చిరంజీవి, నాగబాబు, సాయితేజ్, నిహారిక సోషల్ మీడియా ద్వారా వరుణ్ తేజ్‌కి బర్త్‌డే విషెస్ తెలియజేశారు. అందులో భాగంగానే చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వరుణ్ తేజ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. 'పుట్టిన రోజు శుభాకాంక్షలు తమ్ముడు. పొడుగ్గా ఉన్నంత మాత్రాన తెలివైన వాళ్లమని అనిపించుకోలేరు. అందుకే నీ కోసం నేను ఉన్నాను. నా బాల్యాన్ని ఎంతో సంతోషంగా గడిచేలా చేశావు. అంతేకాదు నాకు సపోర్ట్‌గా ఉన్నావు. ఎంతో ప్రేమించావు. నీ మీద నాకు మాటల్లో చెప్పలేనంత ప్రేమ ఉంది' అంటూ వరుణ్, వైష్ణవ్ లతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. శ్రీజ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.