పెళ్లిసందడి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన భామ శ్రీలీల. తన ఎనర్జిటిక్ డాన్స్, పెర్ఫార్మెన్స్ తో ఇరగదీస్తోందీ అమ్మడు. 2017లో చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారంభించింది శ్రీలీల. ఆమె ఎస్కే 25 అనే కొత్త సినిమాలో కనిపించనుంది. తమిళంలో రూపొందిన ఈ చిత్రానికి సుధా కొంగర దర్శకత్వం వహించారు. ఇందులో శివకార్తికేయన్, జయం రవి, అధర్వ వంటి ప్రముఖ తారలు కనిపించనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా శ్రీలీల తమిళంలోకి అడుగుపెట్టనుంది. క్రిస్మస్ సందర్భంగా ఆమె పింక్ సారీలో మెరిసిపోయింది శ్రీలీల. తన ఫొటోను ఇన్ స్టాలో పోస్టు చేసింది. "శాంటా మీకు పింక్ బహుమతిని పంపారు" ట్యాగ్ లైన్ ఇచ్చింది. ఈ ఫొటోను చూసిన అభిమానులు తెగమురిసిపోతున్నారు.