Srileela : నల్లచీరలో శ్రీలీల..ఫోటోలు వైరల్

Update: 2025-09-01 12:15 GMT

అల్ట్రా మోడ్రన్ డ్రెస్లలో కనిపించే నల్లచీరలో హొయలు పోతోంది. చీర కట్టు ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అందానికి తోడు ఇలా చీర కట్టుతో కవ్వింపులకు పాల్పడుతున్న శ్రీలీలను చూసి చాలా మంది ఫిదా అవుతున్నారు. మొన్న మొన్నటి వరకు చాలా చిన్నగా అనిపించిన శ్రీలీల ఇంతలో ఇంత అందంగా ఎలా మారింది. శ్రీలీల అందానికి పెద్ద స్టార్ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు దక్కాల్సిందే అనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. కన్నడ మూవీ 'కిస్ 'తో హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మశ్రీలీల. కన్నడంలో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేయగానే శ్రీలీలకు తెలుగులో ఆఫర్ దక్కింది. ఏకంగా దర్శకేంద్రుడు రాఘ వేంద్ర రావు నిర్మాణంలో, దర్శకత్వ పర్యవేక్షణ లో రూపొందిన 'పెళ్లి సందడి' సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత మహేశ్ బాబు సరసన గుంటూరు కారం సినిమాలో ఆడిపాడింది. ఈ సినిమాలో కుర్చీ మడత సాంగ్ లో తన ఎనర్జిటిక్ డాన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసిందీ అమ్మడు. తర్వాత పుష్ప - 2 లో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ తో కిస్సిక్ అంటూ ఐటం సాంగ్ చేసి నేషనల్ లెవల్ పాపులారీ సంపాదించిదీ అమ్మడు. అలా టాలీవుడ్లో టాప్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోయిందీ అమ్మడు.

Tags:    

Similar News