Srileela : నీ హృదయంలో.. నీ మైండ్లో..! శ్రీలీల.. సింపుల్ శారీ ఫొటోలు

Update: 2024-12-17 06:15 GMT

పెళ్లిసందడి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన భామ శ్రీలీల. 2019 లో కిస్, భరాతే అనే చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. తర్వాత భగవంత్ కేసరి మూవీలో బాలయ్య కూతురిగా చక్కగా నటించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన గుంటూరు కారం సినిమాలో రెచ్చిపోయిందీ భామ. కుర్చీ మడత సాంగ్ పై తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టింది. తర్వాత రామ్ పోతినేని, పంజా వైష్ణవ్, నవీన్ పోలిశెట్టి, నితిన్ వంటి హీరోల సరసన నటించింది అమ్మడు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ లో నటిస్తోంది. రీసెంట్ ప్రపంచవ్యాప్తంగా విడుదలైన బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప 2 లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కిసిక్ అంటూ మాస్ స్టెప్పులేసిందీ భామ. శ్రీలీల సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో టచ్లోనే ఉంటుంది. తాజాగా శ్రీలీల లవ్ సింబల్స్ జోడించి..'నీ హృదయంలో.. నీ మైండ్లో 'అంటూ సింపుల్ శారీ ఫొటోలు పంచుకుంటూ ఈ క్యాప్షన్ రాసుకొ చ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడి క్యా ప్షన్ వైరల్ అవుతోంది. ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్ పెట్టిం దనే చర్చ మొదలైంది.

Tags:    

Similar News