బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో వస్తున్నా.. హిట్ అనే మాట వినలేకపోతున్నాడు సుధీర్ బాబు. స్ట్రాంగ్ కంటెంట్స్ ఉంటే ప్రజెంటేషన్ బావుండటం లేదు. ప్రజెంటేషన్ బావున్నా.. కంటెంట్ వీక్ గా కనిపిస్తోంది. లాస్ట్ ఇయర్ మా నాన్న సూపర్ హీరో, హరోంహర చిత్రాలతో వచ్చాడు. రెండూ పోయాయి. ఈ యేడాది ‘జటాధర’అనే చిత్రంతో రాబోతున్నాడు. తెలుగు, హిందీ బై లింగ్వుల్ మూవీగా వస్తోందీ చిత్రం. దివ్య ఖోస్లా హీరోయిన్. సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్కర్, శుభలేఖ సుధాకర్ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అభిషేక్ జైస్వాల్, వెంకట్ కళ్యాణ్ ద్వయం ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది.
ఇప్పటికే జటాధర మేజర్ పార్ట్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఆ మధ్య వచ్చిన టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందినట్టుగా కనిపిస్తోన్న ఈ మూవీ రిలీజ్ డేట్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. నవంబర్ 7న జటాధరను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది టీమ్. ఇప్పటికైతే తెలుగు నుంచి ఆ డేట్ లో మరే సినిమా అనౌన్స్ అయి లేదు. ముందు ముందు వచ్చినా.. సుధీర్ కు ఇబ్బంది ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ టైమ్ లో పెద్ద సినిమాలేం లేవు. వచ్చేవి మాగ్జిమం మినీ, మీడియం రేంజ్ మూవీసే ఉంటాయి. సో.. ఈ సారి కంటెంట్, ఎగ్జిక్యూషన్ రెండూ బావుంటే సుధీర్ కు హిట్ పడొచ్చు.