Sundeep Kishan : హీరో సందీప్ కిషన్ హోటల్ పై కేసు నమోదు

Update: 2024-07-11 06:44 GMT

హైదరాబాద్లోని పలు రెస్టారెంట్స్ నాసీరకం ఆహార పదార్థాలు తయారీ, విక్రయాలపై ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు కేసులు కూడా నమోదు చేశారు. సికింద్రాబాద్ లో హీరో సందీప్ కిషన్ కు చెందిన వివాహ భోజనంబు హోటల్లో అధికారులు తనిఖీలు నిర్వహించి కేసు నమోదు చేశారు.

హోటల్ లో నాసిరకం పదార్ధాలను గుర్తించి వాటిని సీజ్ చేశారు. సికింద్రా బాద్ లోని వివాహ భోజనంబు హోటల్లో చిట్టి ముత్యాలు బియ్యం (25 కిలోలు) 2022 నాటికి డేట్ అయిపోయిన బ్యాగ్ గుర్తించామని అధికారులు తెలిపారు. అలాగే సింథటిక్ ఫుడ్ కలర్తో 500 గ్రాముల కొబ్బరి తురుము, స్టీల్ కంటైనర్లలో నిల్వ చేసిన ముడి ఆహార వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే హోటల్లో తయారు చేసిన ఆహార పదార్థాలపై సరిగా లేబుల్ చేయలేదని, కొన్నింటికి మూతలు కూడా లేనట్లు తనిఖీలలో తేలింది.

అదేవిధంగా ఫుడ్ హ్యాండ్లర్లకు మెడికల్ ఫిటెనెస్ సర్టిఫికెట్లు అందుబాటులో లేవని, వంటగది ఆవరణలోని కాలువలలో మురికి నీరు ఉందని, అలాగే ఆహార పదార్థాల తయారీలో ఉపయోగించే నీరు కూడా పరిశుభ్రంగా లేనట్లు గమనించి కేసు నమోదు చేసినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు.

Tags:    

Similar News