Supreme Court : సురేశ్ ప్రొడక్షన్స్ కు సుప్రీంలో చుక్కెదురు

Update: 2025-05-03 07:00 GMT

వైజాగ్ లోని రామానాయుడు స్టూడియో భూముల కేసులో జోక్యం చేసుకునేందుకు సు ప్రీంకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. గతంలో ఫిల్మ్ సిటీ కోసం కేటాయించిన భూములను ఇతర అవసరాలకు వాడుకోవ చ్చని జగన్ ప్రభుత్వం సురేష్ ప్రొడక్షన్స్కు అనుమతించింది. ఈక్రమంలో గత ప్రభుత్వ నిర్ణయాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చె ప్పాలని ప్రస్తుత ప్రభుత్వం సురేశ్ ప్రొడక్షన్స్ కు షోకాజ్ నోటీసు ఇచ్చింది. దీన్ని సురేష్ ప్రొ డక్షన్స్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఇవాళ విచారణ జరిపిన జస్టిస్ అభయ్ ఎస్ కా ధర్మా సనం.. పిటిషన్ లో జోక్యం చేసుకునేందుకు ని రాకరించింది. ఇంటీరియమ్ రిలీఫ్ కుదరదని తేల్చింది. ఈ వ్యవహారంపై స్థానిక కోర్టును ఆశ్ర యించాలని సూచించింది.

Tags:    

Similar News