ఇండస్ట్రీలో ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా హిట్స్ లేకపోతే ఇబ్బంది తప్పదు. అదేంటో.. ఎంతోమంది యంగ్ స్టర్స్ కు ఫస్ట్ ఛాన్స్ లు ఇచ్చి విజయాలు అందించిన అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ మాత్రం ఏళ్ల తరబడి హిట్స్ లేక తంటాలు పడుతున్నాడు. ఫస్ట్ మూవీపై భారీ అంచనాలుంటే అది డిజాస్టర్ అయింది. ఇప్పటి వరకూ ఐదు సినిమాలు చేశాడు. బ్యాచిలర్ మూవీ మాత్రమే జస్ట్ ఓకే అనిపించుకుంది. మిగతావన్నీ ఫట్. ఈ కారణంగానే అతను ఇప్పుడు బయట తిరగడం లేదట. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జుననే చెప్పాడు.
తాజాగా అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి కార్యక్రమం జరిగింది. ఈ ప్రోగ్రామ్ కు అక్కినేని ఫ్యామిలీ అంతా అటెండ్ అయింది. ఒక్క అఖిల్ తప్ప. మరి చిన్న మనవడు లేకపోతే అంతా అడుగుతారు కదా. అభిమానులు అఖిల్ గురించి ఆరా తీశారు. దీంతో నాగ్ ఈ మాట చెప్పాడు. ఒక సూపర్ హిట్ కొట్టిన తర్వాతే అభిమానుల ముందుకు వస్తా అని పంతం పట్టాడట. ఆ పంతం నెరవేరాకే ఫ్యాన్స్ ను కలుస్తా అని చెప్పాడట. అందుకే తాతగారి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ కు కూడా రాలేదట.
అయినా ఇండస్ట్రీలో ఇలాంటి పంతాలు పట్టకూడదని చెప్పాలి కదా నాగార్జున గారూ.. ఏ సినిమా ఎందుకు హిట్ అవుతుందో ఎవరూ చెప్పలేరు. మనం సూపర్ హిట్ అవుతాయనుకున్నవి ఫట్ మంటాయి. కాస్త కష్టమే అనుకున్నవి అనుకోకుండా బ్లాక్ బస్టర్ అవుతాయి. ఏమోలే కుర్రాడు.. బాగా హర్ట్ అయినట్టున్నాడు.. తొందర్లోనే ఓ మంచి హిట్ పడాలని ఆశీర్వదిద్దాం.