Pushpa - 2 : పుష్ప - 2 సినిమాకు తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

Update: 2024-11-07 11:00 GMT

టాకీస్: అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా పుష్ప 2 ది రూల్. ఫాహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. డిసెంబర్ 5న ఈ సినిమా థియేట్రికల్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన మూడు అప్డేట్స్ వచ్చేశాయి. నవంబర్ 15న ఈ మూవీ ట్రైలర్ విడుదల కాబోతోంది. ఈ నెల 12, 13 తేదీల్లో సినిమా పూర్తవుతుంది. 3 నిమిషాల 45 సెకన్లకు ట్రైలర్ లాక్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో పాటు సినిమాకు సంబంధించిన ఐటం సాంగ్ చిత్రీకరణ రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. శ్రీలీల, అల్లుఅర్జున్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షుకులతో చిందులు వేయించేలా ఈ పాట రూపుదిద్దుకుంటోంది. మరో అప్డేట్ ఏమిటంటే ఈ సినిమాకు తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సిద్ధం చేస్తున్నారు. డిఫరెంట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేయనున్నాడు తమన్.

Tags:    

Similar News