Tamannaah : బిజినెస్ లోకి తమన్నా ఎంట్రీ

Update: 2025-08-05 16:00 GMT

ఇండియా వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ లో క్రేజ్ ఉన్న హీరోయిన్లలో తమన్నా భాటియా ఒకరు. ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమాల ద్వారా మంచి గుర్తింపు తె చ్చుకుంది. టాలీవుడ్ లో ఉన్న దాదాపు ఈ తరం స్టార్ హీరోల అందరితోనూ జతకట్టింది. తన నటనతో, అందాలతో ప్రేక్షకులను ఆకట్టు కుంది. అయితే ఈ మధ్యకాలంలో మాత్రం ఈ మిల్కీ బ్యూటీకి తెలుగులో పెద్దగా చాన్స్లు రావడం లేదు. కానీ అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని యూస్ చేసుకుంటూ అద్భుతమైన రీతిలో కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ భామ జ్యూవెలరీ బిజినెస్ లో కొనసా గుతుంది. తండ్రి ద్వారా కొన్ని ఔట్ లెట్స్ లో పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడు ఈ బ్యూటీ మరో కొత్త వ్యాపారంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలు స్తోంది. అందుకు సంబంధిం చిన చిన్న హింట్ ఇస్తూ కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. మరి తమన్నా ఎలాంటి బిజినెస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది అనేది మరికొద్ది రోజుల్లోనే క్లారిటీగా తెలిసే అవకాశం ఉంది. మరోవైపు నయనతార,రష్మిక లాంటి హీరోయిన్లు ఇప్ప టికే వ్యాపారవేత్త లుగా మారుతున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News