Tamannaah: మరోసారి మెగాస్టార్‌తో మిల్కీ బ్యూటీ.. భారీగా పారితోషికం..
Tamannaah: మెగాస్టార్ చిరంజీవి స్పీడ్‌గా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.;
Tamannaah (tv5news.in)
Tamannaah: మెగాస్టార్ చిరంజీవి స్పీడ్‌గా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఆచార్య సినిమా ఇంకా విడుదల కాకముందే అప్పుడే మరో రెండు సినిమాల షూటింగ్లకు తేదీని ఖరారు చేసేసుకున్నారు. వీటిలో తమిళ సినిమా 'వేదాళం'కు రీమేక్‌గా తెరకెక్కుతున్న 'భోళా శంకర్'పై మెగా ఫ్యాన్స్‌లో భారీగానే అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తున్నారో మూవీ టీమ్ రిలీల్ చేసింది.
మిల్కీ బ్యూటీ తమన్నా సినిమాలు చేయడంలో స్పీడ్ తగ్గినా కూడా సీనియర్ హీరోల సినిమాల్లో ఛాన్సులు దక్కించుకోవడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గట్లేదు. ఇటీవల సీటీమార్ సినిమాతో హిట్ కొట్టిన తమన్నా తరువాతి ప్రాజెక్టులపై ప్రస్తుతం ఎలాంటి క్లారిటీ లేదు. పైగా ఇటీవల మాస్టర్ చెఫ్ నుండి కూడా తమన్నా తప్పుకోవడంతో తన ఫ్యాన్స్ అంతా నిరాశకు గురయ్యారు. ఇంతలోనే వారిని ఖుషీ చేసే అప్డేట్ వచ్చేసింది.
తన కెరీర్ ప్రారంభించి ఇన్నేళ్లయినా మెగాస్టార్ చిరంజీవితో పూర్తిస్థాయిలో హీరోయిన్‌గా నటించే అవకాశం తమన్నాకు ఇప్పటివరకు రాలేదు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన 'సైరా' చిత్రంలో తమన్నా ఉన్నా తను సెకండ్ హీరోయిన్ పాత్ర వరకే పరిమితమయ్యింది. అయితే ఇన్నాళ్లకు తమన్నాకు చిరుతో హీరోయిన్‌గా స్టెప్పులేసే అవకాశం లభించింది.
మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'భోళా శంకర్'లో చిరంజీవి హీరోగా నటిస్తుండగా కీర్తి సురేశ్ ఆయనకు చెల్లెలి పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే పెద్దన్న చిత్రంలో రజినీకాంత్‌కు చెల్లిగా నటించి మెప్పించిన కీర్తి.. మరోసారి మరో స్టార్ హీరోకు చెల్లి పాత్ర చేయనుంది. అయితే ఇందులో తమన్నా హీరోయిన్‌గా నటిస్తుందని ఇటీవల మూవీ టీమ్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.
Honored and ecstatic to be a part of the MEGA MASSIVE MOVIE #BholaaShankar 🔱
— Tamannaah Bhatia (@tamannaahspeaks) November 9, 2021
Can't wait to share the screen with @KChiruTweets sir once again!
Bring it on @MeherRamesh Gaaru! 😎@AnilSunkara1 @KeerthyOfficial @AKentsOfficial @BholaaShankar pic.twitter.com/YV0fIm3uVp
కెరీర్‌లో మొదటిసారి చిరంజీవి పక్కన హీరోయిన్‌గా ఒక కమర్షియల్ సినిమాలో ఛాన్స్ వచ్చినందుకు తమన్నా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఓకే చెప్పేసిందట. అంతే కాకుండా భారీగా పారితోషికం కూడా డిమాండ్ చేసిందని టాక్. ఇందులో నటించడానికి తమన్నా 3 కోట్లు డిమాండ్ చేయగా దానికి మూవీ టీమ్ కూడా ఓకే చెప్పిందట. ఇక నవంబర్ 15 నుండి 'భోళా శంకర్' రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.