తమిళ దర్శకుడు సభాపతి దక్షిణామూర్తి అలియాజ్ SD సభా(61) అనారోగ్యంతో కన్నుమూశారు. ఈయన తమిళంలో విజయ్‌కాంత్ హీరోగా భారతన్ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత ప్రభుదేవాతో వీఐపీ అనే సినిమాను తెరకెక్కించారు. తెలుగులో 2005లో జగపతిబాబు, కళ్యాణి జంటగా పందెం అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. సభా తమిళంలో తీసిన సుందర పురుషుడు అనే సినిమా ‘అందాల రాముడు’గా రీమేక్ చేశారు. మొత్తంగా 10 మూవీలకు పనిచేశారు.
ఆరోజుల్లో ఉన్న చాలామంది దర్శకులలాగా కాకుండా కాస్త డిఫరెంట్ కథలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయాలని ప్రయత్నించేవారు సభాపతి దక్షిణామూర్తి. అందులో భాగంగానే ‘సుందర పురుషాన్’, ‘వీఐపీ’ లాంటి సినిమాలు తెరకెక్కించారు. అలా దర్శకుడిగా కెరీర్‌ను పూర్తిగా పక్కన పెట్టకుండా అవకాశం దొరికిన ప్రతీసారి తన సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూనే ఉన్నారు. అలా వరుసగా అరడజనుకు పైగా తమిళ సినిమాలను డైరెక్ట్ చేసిన తర్వాత ఆయన తెలుగులో కూడా అడుగుపెట్టారు. జగపతి బాబు, కళ్యాణి కాంబినేషన్‌లో ‘పందెం’ అనే మూవీని తెరకెక్కించి నేరుగా తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించారు సభాపతి దక్షిణామూర్తి.