శ్రావణ మాసం ఎంతో పవిత్రమైంది. చాలా మంది నియమ నిష్టలతో నెలంతా ఉంటారు. పూర్తిగా శాఖాహారులుగా మారిపోతారు. ఇక భర్త యోగ క్షేమాల కోసం మహిళలు శుక్రవారం ప్రత్యేక పూజలు కూడా చేస్తుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే నీసు వాసనే దరి చేర నివ్వరు. అలాంటి వ్రతమే చేసింది బాలీవుడ్ నటి తను శ్రీ దత్తా. రోజంతా ఉపవాసం ఉండాలని నిర్ణయించుకుంది. అనుకున్నట్లుగానే ఉదయం నుంచి సాయంత్రం వరకు నిష్టగానే గడిపింది. కానీ తీరా సాయంత్రానికి ఆమె మనసు ఏకంగా మటన్ వైపు మళ్లింది. షాపుకెళ్లి మటన్ తెచ్చుకొని వండుకొని తిన్నట్లు తాను స్వయంగా వెల్లడించింది. మటన్ కాంబినేషన్ గా అన్నంలో రుచికరమైన పప్పు కూడా వేసుకుందట. తాను అలా చేయడమే కాకుండా ఇతరులకు సలహాలు ఇచ్చింది. 'ఉపవాసం మరీ కఠినంగా చేయాల్సిన పని లేదు. ఎవరి అవసరాలకు తగ్గట్టు వారు మార్చుకోవచ్చు. ఎవరైనా మీ మానసిన ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా ప్రయత్నస్తే ఫుల్ గా తినడంపై దృష్టి పెట్టండి. ఆహారమే నిజమైన మెడిసిన్ . నాకైతే ఇలాంటి ఉపవాసమే బాగా పని చేస్తుంది' అంటూ పేర్కొంది. దీంతో ఆమెపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేం ఉపవాసం? శ్రావణమాసాన్ని కించప రిచిందని పోస్ట్లు పెడుతున్నారు.