తెలుసు కదా.. విభిన్నంగా ప్రమోషన్స్!

Update: 2025-06-28 11:00 GMT

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొందుతున్న 'తెలుసు కదా ' మూవీలో శ్రీనిధిశెట్టి, రాశి ఖన్నాలు హీరోయిన్స్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. సాధారణంగా సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటే కాంబో సీన్స్ చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఇందులో మాత్రం వీరిద్దరి కాంబోలో చాలా సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. ఇద్దరు ముద్దుగుమ్మల మధ్య నలిగిపోయే పాత్రలో సిద్దు నవ్వులు పూయించే అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్ 17న ఈ మూవీ విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కాస్ట్యూమ్స్ డైజనర్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను విభి న్నంగా ప్రమోట్ చేయాలి అనే ఉద్దేశంతో ఇప్పటికే మంచి కంటెంట్ వీడియోలను తయారు చేశారట. అందులో భాగంగానే సిద్ధు జొన్నలగడ్డ వీడియో కాల్ వీడియోను విడుదల చేశారు. తాజాగా శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నాలు లవ్ సింబల్ ను పెట్టిన ఫొటోను షేర్ చేశారు. సాధారణంగా అమ్మాయి, అబ్బాయి లవ్ సింబల్ ను రెండు చేతులతో ఏర్పాటు చేస్తే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కానీ హీరోయిన్స్ ఇద్దరూ లవ్ సింబల్ ను పెట్టినా కూడా ఫొటో వైరల్ అవుతోంది.

Tags:    

Similar News