Hollywood Actor : హాలీవుడ్ నటుడితో టెన్సిస్ స్టార్ పెళ్లి..

Update: 2025-07-24 06:30 GMT

వీనస్ విలియమ్స్.. ప్రొఫెషనల్ అమెరికన్ టెన్నిస్ ప్లేయర్. ఆమె ఏడు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించింది. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్ 1 ర్యాంక్‌ను కైవసం చేసుకుంది. తన సోదరి సెరెనా విలియమ్స్‌తో కలిసి టెన్నిస్ ప్రపంచంలో గొప్ప పేరు సంపాదించింది. వీనస్ ఐదు వింబుల్డన్ సింగిల్స్ టైటిల్స్, రెండు యూఎస్ ఓపెన్ సింగిల్స్ టైటిల్స్ గెలుచుకుంది. ఆమె మూడుసార్లు మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్ 1 ర్యాంక్‌ను సాధించింది. మొత్తం 11 వారాల పాటు ఆ స్థానంలో కొనసాగింది. వీనస్ రెండు ఒలింపిక్ బంగారు పతకాలను గెలుచుకుంది. తాజాగా ఆమె నటుడితో ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఇటాలియన్ నటుడు, నిర్మాత అయిన ఆండ్రి ప్రెటీతో వీనస్ విలియమ్స్ నిశ్చితార్థం జరిగింది. వీరు సెప్టెంబర్‌లో ఇటలీలోని అమాల్ఫీ తీరంలో వివాహం చేసుకోనున్నారు. అక్కడే వారి ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది. దానికి గుర్తుకే అదే ప్లేస్‌లో పెళ్లి చేసుకోనున్నారు. వీనస్ విలియమ్స్ 45 ఏళ్లు ఉండగా.. ఆండ్రియా ప్రీతికి 37 ఏళ్లు. ఆండ్రి ప్రెటీ నటుడిగానే కాకుండా దర్శకుడు, మోడల్ కూడా. వన్ మోర్ డే మూవీతో మంచి పేరు సంపాదించుకున్నాడు.

Tags:    

Similar News