Rashmika Mandhana : అది..మన బాధ్యతే.. రష్మిక మంధాన

Update: 2025-05-10 07:00 GMT

భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమైన నేపథ్యంలో నేషనల్ క్రష్ రష్మిక మంధాన ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. 'టెర్రరిజం నుంచి మనల్ని కాపాడుకునేందుకు చేసేది యుద్ధం కాదు. ఈ పోరాటానికి మద్దతిచ్చే వారిని యుద్ధాన్ని కాంక్షించే వారిగా పేర్కొనొద్దు. నేషనల్ సెక్యూరిటీ, జస్టిస్ కోసం ఆరాటపడే పౌరులు వారు. దూకుడు ధోరణి, అత్యవసర ఆత్మర క్షణకు మధ్య చాలా నైతిక భేదం ఉంటుంది. కుట్రపూరితంగా జరిగిన ఉగ్రవాద చర్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోయినప్పు డు.. దానికి ప్రతీకారం తీర్చుకోవడం అనేది బాధ్యతే అవుతుంది తప్ప.. అవకాశం కాదు. శాంతిని కోరుకోవడమంటే అర్థం.. జరిగిన హానిని సైలెంట్ గా అంగీకరించడం కాదు. మనకు జరిగిన అన్యాయానికి బదులు తీర్చు కుంటున్న దేశాన్ని ప్రశ్నించొద్దు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారిని ప్రశ్నిం చండి' అంటే తన ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చింది.

Tags:    

Similar News