ప్రభాస్ డెబ్యూ మూవీ ఈశ్వర్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది శ్రీదేవి విజయ్ కుమార్. ఆ సినిమా ఫ్లాప్ అయినా ఆమె అందం, అభినయానికి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్న నటి హీరోయిన్ గా నటించడం మానేసి జడ్జిగా పలు షోల్లో కనిపించింది. కానీ ఇప్పుడు హీరోయిన్ గా రీ ఎంట్రి ఇవ్వబోతుంది. నారా రోహిత్ హీరోగా వెంకటేష్ నిమ్మలపూడి తెరకెక్కించిన సుందరకాండలో నటించింది. ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న నటి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పింది. అందులో ఓ సీన్ కోసం కొన్నాళ్ల పాటు ఫుడ్ తీసుకోకుండా.. కేవలం నీళ్లు తాగిందట. ఈ మూవీలో హీరోయిన్ స్కూల్ యూనిఫాంలో కనిపించాల్సి ఉండగా.. ఆ సీన్ కోసం ఆమె ఆహారం తీసుకోవడం మానేసిందట. ఆ సీన్ ఎలా వస్తుందో నని భయపడ్డ దర్శకుడు తీరా చాలా చక్కగా రావడంతో ఆమె అసలు కారణం చెప్పిందట. ఈ మూవీ సక్సెస్ పై హీరోయిన్ చాలా ఆశలు పెట్టుకుంది.