Pawan Kalyan : కష్ట సమయాల్లో నాకు సపోర్ట్‌గా నిలిచింది అతడే.. పవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.
పవన్ కళ్యాణ్ నటించిన 'హరి హర వీర మల్లు' చిత్రం జూలై 24న విడుదల కానుంది. ఆరేళ్ల క్రితం ప్రారంభమైన ఈ సినిమా ఇప్పుడు విడుదలవుతోంది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కష్ట సమయంలో సహాయం చేసిన స్నేహితుడి గురించి మాట్లాడారు.
సినిమాల్లో విజయాల కంటే ఓటములే ఎక్కువగా చూశాను అని పవన్ అన్నారు. ఒకానొక సమయంలో వరుసగా పరాజయాలే ఎదురయ్యాయని చెప్పారు. గెలిచినప్పుడు అందరూ ఉంటారు.. కానీ ఓడిపోయినప్పుడు తనను వెతుక్కుంటూ వచ్చింది త్రివిక్రమ్ శ్రీనివాస్ అని చెప్పారు. ‘‘నేను ఓటమిలో ఉన్నప్పుడు సినిమా పరిశ్రమ నుండి ఎవరూ రాలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. కష్ట సమయాల్లో ఆయన నాకు సపోర్ట్‌గా నిలిచాడు. జల్సా సినిమాతో నన్ను మళ్లీ నిలబెట్టాడు. ఏ పెద్ద డైరెక్టర్ కూడా తనతో సినిమా తీయలేదు’’ అని పవన్ అన్నారు.
'జల్సా' సినిమా కంటే ముందు పవన్ బాలు, బంగారం, అన్నవరం సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఆ తర్వాత వచ్చిన 'జల్సా' సినిమా పెద్ద హిట్ అయింది. తర్వాత 2013లో త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ‘అత్తారింటికి దారేది’ సినిమా చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 2018లో వారి కాంబినేషన్‌లో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ డిజాస్టర్‌గా నిలిచింది.