Spirit Movie : అందుకే స్పిరిట్ మూవీ నుంచి దీపకను తీసేశారట

Update: 2025-05-29 06:45 GMT

డార్లింగ్ హీరో ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్పిరిట్. ఈ చిత్రం షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఈ మూవీలో ముందుగా దీపికా పదుకొణేని హీరోయిన్ గా అనుకొన్నారు. స్టోరీ చెప్పగా ఆమె అనేక కండీషన్స్ పెట్టింది. దీనికి తోడు రూ. 20 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందనే వార్త నెట్టింట షికార్లు కొట్టింది. ఆ తర్వాత ఆమె స్థానంలో ‘త్రిప్తి డిమ్రి' అని అఫీషియల్గా ప్రకటించాడు సందీప్ రెడ్డి వంగా. ప్రభాస్ మూవీలో అవకాశం ఇవ్వడంతో అమ్మడు ఆనందానికి అవధుల్లేవ్. దీపికా పదుకొనేని ఈ సినిమా నుండి తొలగించడానికి ఆమె రూ.20 కోట్లకు పైగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయడమే అని తెలుస్తోంది. ఆమె ఇటీవలే తల్లి అయినందున షూటింగ్ సమయాన్ని తగ్గించాలని కోరడం సందీప్కి నచ్చలేదనే టాక్ వచ్చింది. ఇలా చాలా వార్తలు వైరల్ అయినప్పటికీ చివరకు ఆమె స్థానంలో త్రిప్తి వచ్చి చేరింది. అయితే ఈ సినిమాకి త్రిప్తికి గాను ఏకంగా రూ. 4 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Tags:    

Similar News