Triptie Dimri : యానిమల్'కు అందుకే ఓకే చెప్పా..

Update: 2025-01-07 06:00 GMT

ఇటీవల యావత్ మూవీ ఇండస్ట్రీని షేక్ చేసిన సినిమా 'యానిమల్ రణ్ వీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన ఈ సినిమా మిశ్రమ టాక్ అందుకుంటూ కూడా భారీ కలెక్షన్లు రాబట్టింది. టాక్ ఏమని వచ్చినా సినిమా మాత్రం బంపర్ హిట్ అయింది. ఈ సినిమాతో మూవీ ఇండస్ట్రీలో ఒక్కసారిగా మెరిసిన భామ త్రిప్తిడిమి.. యానిమల్ మూవీతో అమ్మడికి వచ్చిన క్రేజ్ అంతా ఇంతాకాదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిప్తి తన కెరీర్ గురించి మాట్లాడుతూ అసలు యానిమల్ మూవీకి తాను ఎందుకు ఒకే చెప్పింది అన్న విషయాన్ని కూడా వెల్లడించారు.. ఆరంభంలో అవకాశాల్లేక కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయని గుర్తు చేసుకున్నారు... అనంతరం యానిమల్ గురించి మాట్లాడుతూ... ఈ సినిమాను తానె ప్పుడూ కూడా స్త్రీద్వేష చిత్రంగా చూడర ఉన్నారు..." సినిమాలకు అలాంటి ట్యాగ్స్ ఇప్పును. 'కోలా', 'బుల్బుల్' చిత్రాలు చేస్తున్నప్పుడు వాటిని స్త్రీవాద చిత్రాలుగా భావించ లేదు. ఆయా కథల్లోని పాత్రకు కనెక్ట్ అయి.. దర్శకులపై నమ్మకం ఉంచి వాటిని ఎంచుకుంటా. ఈ సినిమాలో ఆఫర్ రాగానే దర్శకుడు సందీపన్ను కలిశా.. ఆయన నాకు కథ గురించి ఎక్కువగా చెప్పలేదు. జోయా పాత్ర గురించే వివరించారు. అప్పటివరకూ నేను కేవలం సున్నితమైన, పాజిటివ్ రోల్స్ మాత్రమే పోషించా. 'యానిమల్ 'లో నా పాత్ర ఇందుకు భిన్నమైంది. మనసులో మోసం చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ... ఆయ, సాను భూతి కనిపించాలని దర్శకుడు చెప్పారు.. అది నాకు సవాలుగా అనిపించింది. వెంటనే సినిమాను ఒకే చెప్పాను" అని త్రిప్తి డిమి తెలిపారు

Tags:    

Similar News