Keerthy Suresh : కీర్తి సురేష్ తో విశాల్ పెళ్లి విషయం చెప్పిన దర్శకుడు

Update: 2025-02-25 10:30 GMT

సౌత్ లో మోస్ట్ ఫేవరెట్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతున్న కీర్తి సురేష్ గురించి ఎప్పుడూ ఎలాంటి రూమర్స్ రాలేదు. బట్ సడెన్ గా తను 15యేళ్లుగా ప్రేమలో ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నా అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. షాక్ నుంచి తేరుకునే లోపే మంగళసూత్రంతో దర్శనం ఇచ్చింది. ఆంటోనీ తట్టిల్ అనే వ్యక్తిని తను పెళ్లి చేసుకుంది. స్కూల్ డేస్ నుంచీ ఇద్దరూ లవ్ చేసుకున్నారట. ఫైనల్ గా పెళ్లైంది. అయితే లేటెస్ట్ గా ఓ తమిళ్ ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ ను విశాల్ కు ఇచ్చి పెళ్లి చేయాలని అతని తండ్రి భావించాడని దర్శకుడు లింగుస్వామి చెప్పడం వైరల్ గా మారింది.

కీర్తి సురేష్ లాంటి సాలిడ్ బ్యూటీని పెళ్లి చేసుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు. కాకపోతే అందుకు అదృష్టం కూడా ఉండాలి కదా. కొన్నాళ్ల క్రితం లింగుస్వామి డైరెక్షన్ లో పందెకోండి 2 సినిమాలో నటించింది కీర్తి సురేష్. పెందెంకోడి మూవీతో విశాల్ కు మాస్ హీరో ఇమేజ్ వచ్చింది. అదో ఎవర్ గ్రీన్ మూవీ. అలాంటి మూవీకి సీక్వెల్ అంటే అంచనాలుండే. బట్ సినిమా పోయింది. అయితే ఆ మూవీ షూటింగ్ టైమ్ లో విశాల్ తండ్రి జికే రెడ్డి దర్శకుడు లింగుస్వామి వద్దకు వచ్చి.. ‘ఆ అమ్మాయి మా వాడిని పెళ్లి చేసుకుంటుందేమో’ అడుగు అని అదే పనిగా చెప్పేవాడట. అతని పోరు పడలేక లింగుస్వామి నిజంగానే కీర్తి సురేష్ ని అడిగాట్ట. కానీ అప్పుడే తను తన స్కూల్ డేస్ నుంచి లవ్ లో ఉన్న విషయం చెప్పిందనీ.. అతన్నే ఇప్పుడు పెళ్లి చేసుకుందని ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు లింగుస్వామి.

మొత్తానికి విశాల్ ఫాదర్ కీర్తి తన కోడలు కావాలని ఆశపడ్డాడు అని అర్థం అవుతోంది. మరి అసలు విశాల్ మనసులో ఏముందో కానీ.. నిజంగా ఈ కాంబినేషన్ లో పెళ్లి వర్కవుట్ అయ్యేదేనా ..?

Tags:    

Similar News