టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ దంపతులు అతి త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని వారు ఈ ఏడాది జనవరిలోనే ప్రకటించారు. తాజాగా రహస్య గోరఖ్ సీమంతం వేడుక గ్రాండ్గా జరిగినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో కొన్ని ఫొటోస్ తన ఇన్ స్టాలో పంచుకుంది రహస్య. అందులో బేబీ బంప్, కిరణ్ అబ్బవరంతో కలిసిన పిక్స్ ఉన్నాయి. ఇవి చూసిన నెటిజన్స్, పలువురు సెలబ్రిటీలు దంపతులకు శుభాకాం క్షలు తెలుపుతున్నారు. తన తొలి సినిమాలో హీరోయిన్ గా నటించిన రహస్య గోరఖ్ నే కిరణ్ అబ్బవరం ప్రేమించాడు. కొన్నేళ్ల పాటు రిలేషన్ లో ఉన్న వీళ్లిద్దరూ గతేడాది పెళ్లి చేసుకున్నారు. ఈ జనవరిలో ప్రెగ్నెన్సీ ప్రకటించారు. ఇప్పుడు సీమంతం జరిగింది. మరో ఒకటి రెండు నెలల్లో కిరణ్-రహస్యకు బేబీ పుట్టబోతున్నాడు. ఈ క్రమంలోనే పలువురు నెటిజన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక పెళ్లి తర్వాత రహస్య సినిమాలకి బ్రేక్ ఇవ్వగా, కిరణ్ అబ్బవరం.. గతేడాది 'క' మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. రీసెంట్ గానే 'దిల్ రూబా'తో ప్రేక్షకులను పలకరించాడు. ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు. . కాగా, గతేడాది ఆగస్టులో కిరణ్ అబ్బవ రం, రహస్య వివాహం జరిగిన సంగతి తెలిసిందే.