Nivetha Pethuraj : ప్రియుడితో ఉన్న ఫోటోను షేర్ చేసిన హీరోయిన్.. త్వరలోనే పెళ్లి..

Update: 2025-08-28 08:45 GMT

అలవైకుంఠపురం సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటి నివేదా పేతురాజ్ తన పర్సనల్ లైఫ్ కి సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తనకు కాబోయే భర్తతో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ అభిమానులకు షాక్ ఇచ్చింది నివేదా. ఇప్పటికే తమకు నిశ్చితార్థం కూడా జరిగిపోయిందని వెల్లడించారు. ప్రస్తుతం నివేదా తన ప్రియుడితో ఉన్న ఫొటో నెట్టింట వైరల్ గా మారడంతో ఆమె అభిమానులు, స్నేహితులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

కాగా నివేదా పేతురాజ్ వివాహం చేసుకోబోయే వ్యక్తి పేరు రాజ్‌హిత్ ఇబ్రాన్‌. ఆయన దుబాయ్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అనే ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఈ సంవత్సరం చివర్లో వీరి పెళ్లి జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని.. ఎలాంటి ఆడంబరాలు లేకుండా కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. పెళ్లికి సంబంధించిన మరిన్ని అధికారిక వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

తమిళ చిత్రం 'ఒరు నాల్ కూతు'తో నటిగా అరంగేట్రం చేసిన నివేదా, 'మెంటల్ మదిలో' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘అల వైకుంఠపురములో’, ‘చిత్రలహరి’, ‘బ్రోచేవారెవరురా’, ‘దాస్ కా ధమ్కీ’ వంటి విజయవంతమైన చిత్రాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

Tags:    

Similar News