OTT Record : ఓటీటీలో 'ది కేరళ స్టోరీ' రికార్డు

Update: 2024-03-04 07:30 GMT

దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సినిమా 'ది కేరళ స్టోరీ' (The Kerala Story) సినీ రంగంలోనే కాదు, రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టించిన ఈ చిత్రం ఫిబ్రవరి 16న 'జీ'' వేదికగా ఓటిటిలోకి వచ్చింది. హిందీ, తమిళ, తెలుగు, మలయాళ భాష అందుబాటులో ఉంది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోనూ రికార్డు సృష్టించింది. స్టీమింగ్ అవుతోన్న మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు టాప్ వన్లో కొనసాగుతోంది.

మొత్తం 300 మిలియన్ల వాచ్ మినిట్స్ మైలు రాయిని కూడా దాటేసినట్లు తెలుపుతూ జీక్ పోస్టర్ విడుదల చేసింది. థియేటర్లో విడుదలైన తొమ్మిది నెలల తర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చింది. దీంతో అంచనాలకు మించిన వ్యూస్ సాధిస్తోంది. దర్శకుడు సుదీప్తోసేన్ ' ది కేరళ స్టోరీ'ని తెరకెక్కించారు.

కేరళలో కొన్నేళ్లుగా 32 వేల మంది' యువతులు అదృశ్యమైనట్లు వస్తోన్న ఆరోపణలకు సంబంధించి వారి ఆచూకీ ఎక్కడనే ఇతివృత్తంతో రూపొందించారు. ఓ నలుగురు ఐసిస్ లో చేరిన నేపథ్యంతో కథ నడుస్తుంది. ఈ చిత్రానికి నిర్మాతగా విపుల్ అమృత్ లాల్ షా వ్యవహరించారు. గతంలో 'అస్మా', 'లఖ్ నవూ టైమ్స్ ' ది లాస్ట్ మాంక్ ' వంటి చిత్రాలు నిర్మించారు.

Tags:    

Similar News